చైనా స్టాక్ మార్కెట్లకు కరోనా వైరస్ భయాలు పట్టుకున్నాయి. వరుస సెలవుల తరువాత తెరుచుకున్న స్థానిక ఎక్స్చేంజీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ వందలాది మందిని బలిగొంటున్న నేపథ్యంలో.. భారీ ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తి చివరకు రికార్డు స్థాయి నష్టాలను మిగిల్చాయి.
మార్కెట్లపై కరోనా పంజా- ఐదేళ్లలోనే అత్యధిక నష్టాలు - కరోనా వైరస్ లేటెస్ట్
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం స్థానిక మార్కెట్లపైనా పడింది. వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న చైనా స్టాక్ మార్కెట్లు 5 ఏళ్లలోనే అత్యధిక నష్టాలతో ముగిశాయి.
చైనా మార్కెట్లుపై
షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.72 శాతం (229.92 పాయింట్లు) నష్టపోయి.. 2,746.61కి చేరింది. షెన్జెన్ కాంపోజిట్ ఇండెక్స్ 8.41 శాతం(147.81 పాయింట్లు) క్షీణించి.. 1,609కి చేరింది. 2015 తర్వాత ఆ స్థాయిలో చైనా మార్కెట్లకు నష్టాలు రావడం ఇదే ప్రథమం.
ఇదీ చూడండి:కరోనా కల్లోలం: కేరళలో మూడో కేసు నమోదు
Last Updated : Feb 29, 2020, 12:07 AM IST