ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఔషధాన్ని కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌కు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది. 2022 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
మానవుడిపై పరీక్ష
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్‌తో కలిసి పుణెలో ఉన్న ఎస్ఐఐ కృషి చేస్తోంది. మరో ఆరు నెలల్లో మానవుడిపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఈ సంస్థ పేర్కొంది.