ప్రఖ్యాత ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా ప్రయోగ పరీక్షలను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిపేసింది. ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ తిరిగి ప్రారంభించే వరకు ప్రయోగ పరీక్షలు నిలిపేస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.
భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్ నిలిపివేత - ఆక్స్ఫర్డ్ టీకా
భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకా క్యాండిడేట్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇనిస్టిట్యూట్ నిలిపేసింది. ఉత్పత్తిని కూడా ఆపేసింది. ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ తిరిగి ప్రారంభించే వరకు నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది.
సీరం
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఓ వలంటీర్ అనారోగ్యానికి గురికావడం వల్ల ఆస్ట్రాజెనికా బ్రిటన్‌లో పరీక్షలు నిలిపివేసింది. అయితే భారత్‌లో ప్రయోగపరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో డీసీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయోగాలు ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ ట్రయల్స్‌పై సీరం సంస్థకు షోకాజ్ నోటీసులు