నేడు ఒడుదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చివరకు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలతలు నేటి లాభాలకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 222 పాయింట్లు బలపడింది. 40,248 పాయింట్లతో జీవనకాల గరిష్ఠం వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 43 పాయింట్లు బలపడి..11,961 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,607 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. ఉదయం లాభాల స్వీకరణతో 40,037 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,003 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,850 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.