స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. హెవీ వేయిట్ షేర్లయిన రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ల నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు కుదేలయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రారంభంలో కాస్త సానుకూలంగా కొనసాగిన సూచీలు.. చమురు ధరల వృద్ధితో కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ తేరుకోలేదు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 416 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,529 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 12,231 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 42,274 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,503 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,430 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,217 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..