తెలంగాణ

telangana

ETV Bharat / business

కోలుకున్న మార్కెట్లు- జీవనకాల గరిష్ఠానికి రిలయన్స్ షేర్లు

అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుంది. భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ అత్యధిక లాభాన్ని నమోదు చేశాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Nov 19, 2019, 4:27 PM IST

స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాల నుంచి తేరుకున్నాయి. భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ షేర్ల సానుకూలత నేటి లాభాలకు ప్రధానకారణం. రిలయన్స్ షేర్లు నేడు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 185 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 40,470 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 56 పాయింట్ల వృద్ధితో..11,940 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,544 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,290 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,959 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,881 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్​ అత్యధికంగా 7.36 శాతం లాభాన్ని నమోదు చేసింది. రిలయన్స్ 3.52 శాతం లాభంతో జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. యాక్సిస్​ బ్యాంకు 3.43 శాతం, పవర్​ గ్రిడ్​ 2.68 శాతం, టెక్​ మహీంద్రా 1.84 శాతం, ఎస్​బీఐ 1.57 శాతం లాభాలను గడించాయి.

ఎస్​ బ్యాంకు 2.65 శాతం, ఎం&ఎం 2.19 శాతం, టాటా స్టీల్​ 2.02 శాతం, టీసీఎస్​ 2.02 శాతం, టాటా మోటార్స్ 1.35 శాతం, వేదాంత 1.22 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: ప్రపంచ ప్రతిభా సూచీ​లో మరింత తగ్గిన భారత్​​​ ర్యాంకు​

ABOUT THE AUTHOR

...view details