స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. భారత్‌లో సేవా రంగ కార్యకలాపాలు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయన్న ఓ సర్వే అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. కరోనా వైరస్ చికిత్స విషయంలో పురోగతి.. అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. నేటి లాభాలకు ఇదీ ఓ కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 353 పాయింట్ల వృద్ధితో 41,143 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 111 పాయింట్లు పుంజుకుని 12,090 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,177 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,703 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.