తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్ వడ్డీ కోతతో.. మార్కెట్లకు నష్టాల మోత

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత సహా వృద్ధి భయాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 470 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి.. 10,800 మార్కును కోల్పోయింది. యెస్​ బ్యాంకు​ నేడు అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 19, 2019, 4:15 PM IST

Updated : Oct 1, 2019, 5:21 AM IST

తాజా పరిస్థితులపై స్టాక్​ మార్కెట్​ నిపుణుడి స్పందన

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న నమోదైన లాభాలను సొమ్ము చేసుకునే దిశగా మదుపరులు స్పందించిన కారణంగా.. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. అ తర్వాత ఫెడ్​ వడ్డీ రేట్లు తగ్గించిందన్న ప్రకటనతో మిడ్​ సెషన్​ నుంచి ఒక్క సారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 470 పాయింట్లు క్షీణించింది. చివరకు 36,093 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 10,705 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 36,614 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 35,988 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ నేడు 10,845 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,670 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా మోటార్స్​ 1.97 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 0.64 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.58 శాతం, ఏషియన్ పెయింట్స్​ 0.40 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ నాలుగు సంస్థలు మాత్రమే లాభపడ్డాయి.

యెస్​ బ్యాంకు​ నేడు అత్యధికంగా 15.52 శాతం నష్టపోయింది. టాటా స్టీల్​ 3.66 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంకు 3.59 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.16 శాతం, మారుతీ 2.55 శాతం, ఎస్​బీఐ 2.30 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: ఫెడ్​ వడ్డీ రేట్ల తగ్గింపు ఎంతంటే?

Last Updated : Oct 1, 2019, 5:21 AM IST

ABOUT THE AUTHOR

...view details