స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. గతేడాది డిసెంబర్లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరగడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు ఇన్వెస్టర్లు. ఫలితంగా జీవనకాల గరిష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,873 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 12,343 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,970 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,648 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.