తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనసాగుతున్న బుల్​ జోరు- జీవితకాల గరిష్ఠాలకు సూచీలు

స్టాక్​ మార్కెట్లు లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ జీవితకాల గరిష్ఠాల్ని నమోదుచేశాయి.

STOCKS
స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 18, 2019, 10:08 AM IST

Updated : Dec 18, 2019, 10:33 AM IST

స్టాక్​ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠస్థాయిల్ని తాకాయి. జీఎస్టీ మండలి తీసుకునే నిర్ణయాలపై సానుకూల అంచనాలూ బుల్​ జోరుకు దోహదం చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ ఆరంభంలో 129 పాయింట్లు ఎగబాకి చరిత్రలో అత్యధికంగా 41 వేల 481 పాయింట్లకు చేరింది. తర్వాత కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 41 వేల 435 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ సెషన్​ ఆరంభంలో 12 వేల 199 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ప్రస్తుతం 20 పాయింట్ల వృద్ధితో 12 వేల 185 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

టాటా మోటార్స్, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​యూఎల్​, ఎస్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Dec 18, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details