తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహన, బ్యాంక్​ షేర్ల దన్నుతో మార్కెట్లకు లాభాలు - బిజినెస్ వార్తలు తెలుగు

వాహన, బ్యాంకింగ్​ రంగ షేర్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుంది.

STOCK MARKETS
స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 12, 2019, 4:01 PM IST

Updated : Dec 12, 2019, 4:37 PM IST

స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 169 పాయింట్లు బలపడింది. చివరకు 40,582 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62 పాయింట్లు వృద్ధి చెంది..11,972 వద్దకు చేరింది.

బెంచ్​మార్క్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోవడం, చైనాతో అగ్రరాజ్య వాణిజ్య యుద్ధం తీవ్రత తగ్గడం కారణంగా అంతర్జాతీయంగా సానుకూలతలు పెరిగాయి. దేశీయంగా నేడు విడుదల కానున్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై సానుకూల అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,713 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,491 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,005 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,934 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా మోటార్స్ 7.17 శాతం, ఎస్​ బ్యాంక్ 5.96 శాతం, వేదాంత 3.86 శాతం, టాటా స్టీల్​ 3.29 శాతం, ఎస్​బీఐ 2.91 శాతం, కోటక్​ బ్యాంక్​ 1.76 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఇన్ఫోసిస్ 2.63 శాతం, ఓఎన్​జీసీ 1.68 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 1.51 శాతం, టీసీఎస్​ 1.20 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.95 శాతం, టెక్​ మహీంద్రా 0.28 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి, ముడి చమురు..

రూపాయి నేడు 21 పైసలు బలపడి.. ఇంట్రాడేలో డాలర్​తో పోలిస్తే 70.63కు చేరింది. ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ నేడు 0.74 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 64.19 డాలర్లకు చేరింది.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై సూచీ మాత్రం నష్టాలతో సెషన్​ ముగించింది.

ఇదీ చూడండి:'ఫెడ్' బెంచ్​మార్క్​ వడ్డీ రేట్లు యథాతథం

Last Updated : Dec 12, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details