స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర నేడూ కొనసాగింది. దిగ్గజ సంస్థల షేర్లు రాణించడం, గృహ నిర్మాణానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన నేటి లాభాలకు ప్రధాన కారణం. అంతర్జాతీయ సానుకూలతలు నేటి లాభాలకు ఊతమందించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 184 పాయింట్లు బలపడింది. 40,654 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 50 పాయింట్లు బలపడి..12,016 వద్దకు చేరి.. జీవనకాల గరిష్ఠానికి అడుగు దూరంలో ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,688 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. ఉదయం లాభాల స్వీకరణతో 40,421 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,021 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,947 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సన్‌ఫార్మా 3.50 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 2.74 శాతం, రిలయన్స్ 2.09 శాతం, ఏషియన్ పాయింట్లు 1.69 శాతం, వేదాంత 1.69 శాతం, ఐటీసీ 1.68 లాభాలను ఆర్జించాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు 3.27 శాతం, హిందుస్థాన్ యునిలీవర్ 1.83 శాతం, ఓఎన్జీసీ 1.69 శాతం, టాటా మోటార్స్ 1.66 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.33 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఆర్సెప్కు భారత్ 'నో'తో 10కోట్ల మంది రైతులకు మేలు!