తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాలున్నా స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు - వ్యాపార వార్తలు

స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సెషన్ ప్రారంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. కొద్ది సేపటికే లాభాల్లోకి మళ్లాయి సూచీలు. సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది.

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Jan 28, 2020, 9:50 AM IST

Updated : Feb 28, 2020, 6:11 AM IST

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్​ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చనే భయాలతో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెషన్ ప్రారంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 135 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,290 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్లకు పైగా వృద్ధితో..12,149 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం, సన్​ఫార్మా, ఎస్​బీఐ​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​యూఎల్​, నెస్లే, పవర్​గ్రిడ్​, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:అష్టకష్టాలకు... విన్నపాలు

Last Updated : Feb 28, 2020, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details