తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్​.. మార్కెట్లకు స్వల్ప నష్టాలు - స్టాక్ మార్కెట్​ వార్తలు

బ్యాంకింగ్, ఐటీ రంగాల ప్రతికూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయింది. ఇన్ఫీపై దర్యాప్తులు ముమ్మరం అవుతున్న కారణంగా ఆ సంస్థ షేర్లు నేడు భారీ నష్టాలను నమోదు చేశాయి.

స్టాక్ మార్కెట్ల ముగింపు

By

Published : Oct 24, 2019, 4:23 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం నష్టాలకు ప్రధాన కారణం. అనైతిక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫీపై దర్యాప్తులు ముమ్మరం కావడం వల్ల ఆ సంస్థ షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ల నష్టాలకు ఇదీ ఓ కారణమైంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 38 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39,020 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి..11,582 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 39,327 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,840 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,680 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,635 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్ 3.31 శాతం, రిలయన్స్ 3.12 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 2.09 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.38 శాతం, టాటా స్టీల్ 1.05 శాతం, టాటా మోటార్స్ 0.60 శాతం లాభాలను ఆర్జించాయి.

మొండి బకాయిల కారణంగా ఎస్ ​బ్యాంకు అత్యధికంగా 5.76 శాతం నష్టపోయింది. ఎస్​బీఐ 4.65 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంకు 3.78 శాతం, ఇన్పోసిస్​ 2.36 శాతం, ఎం&ఎం 1.55 శాతం నష్టపోయాయి.

ఇదీ చూడండి: భారత్​లో ఇప్పుడు మరింత 'ఈజీ'- ర్యాంక్​ 63

ABOUT THE AUTHOR

...view details