తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరంభం నుంచి ఆటుపోట్లు- చివరకు స్వల్ప లాభాలు - స్టాక్ మార్కెట్ వార్తలు తెలుగు

రోజంతా ఆటుపోట్లు ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు.. చివరకు స్వల్ప లాభాలను సాధించాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 22 పాయింట్లు వృద్ధి చెందింది. ఇండస్​ఇండ్ బ్యాంకు 5 శాతానికి పైగా లాభపడగా.. ఎస్​ బ్యాంకు 5 శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేసింది.

ఆరంభం నుంచి ఆటుపోట్లు- చివరకు స్వల్ప లాభాలు

By

Published : Nov 1, 2019, 4:17 PM IST

ఒడుదొడుకుల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభంలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. మిడ్​ సెషన్​ తర్వాత కాస్త తేరుకుని.. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడింది. చివరకు 40,165 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 22 పాయింట్లు వృద్ధి చెంది..11,899 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,283 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,014 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,918 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,843 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్​ బ్యాంకు 5.18 శాతం, టాటా స్టీల్​ 5.09 శాతం, వేదాంత 3.10 శాతం, టెక్​ మహీంద్రా 2.94 శాతం, ఓఎన్​జీసీ 2.01 శాతం, యాక్సిస్​ బ్యాంకు 1.75 శాతం లాభాలను గడించాయి.

నిన్న రికార్డు స్థాయి లాభాలను సాధించిన ఎస్​ బ్యాంకు నేడు 5.46 శాతం నష్టాన్ని నమోదు చేసింది. టీసీఎస్​ 3 శాతం, ఎం&ఎం 2.81 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.28 శాతం, టాటా మోటార్స్ 1.58 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: పీఎంసీ కేసులో కేంద్రం, ఆర్బీఐకి కోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details