తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన సెన్సెక్స్​.. ఫ్లాట్​గా నిఫ్టీ - ఆర్థిక రంగం డీలా

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో నేడు మిశ్రమంగా ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 66 పాయింట్లు పుంజుకోగా.. నిఫ్టీ ఫ్లాట్​గా సెషన్​ ముగించింది.

మార్కెట్లు

By

Published : Jun 19, 2019, 4:56 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్​ వడ్డీ రేట్లపై సానుకూల అంచనాలు ఉన్నప్పటికీ.. భారత్-అమెరికా, చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేశాయి. ఐటీ రంగ షేర్లు రాణించగా.. ఆర్థిక, వాహన రంగం షేర్లు డీలా పడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 66 పాయింట్లు బలపడింది. చివరకు 39,113 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11,691 పాయింట్ల వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​... మిడ్​ సెషన్​లో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. సెషన్ మొత్తం 38,881-39,436 పాయింట్ల మధ్య కదలాడింది ఈ సూచీ.
నిఫ్టీ నేడు 11,802 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,625 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్ 4.60 శాతం, కోటక్ బ్యాంకు 2.44 శాతం, ఎన్​టీపీసీ 1.58 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.11 శాతం, పవర్ గ్రిడ్ 1.06 శాతం, ఓఎన్​జీసీ 0.75 శాతం లాభాలను ఆర్జించాయి.

ఎస్​ బ్యాంకు 5.54 శాతం, టాటా మోటార్స్ 2.31 శాతం, హీరో మోటార్స్ 1.99 శాతం, ఎం&ఎం 1.71 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.68 శాతం నష్టాలను నమోదుచేశాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు ఫ్లాట్​గా ముగిసింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.70 గా ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.55 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 61.80 డాలర్లకు చేరింది.

ఇతర మార్కెట్లు ఇలా...

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్ల ర్యాలీ కొనసాగింది. హాంకాంగ్ సూచీ-హాంగ్​ సెంగ్​ 2.56 శాతం వృద్ధి చెందింది. షాంఘై సూచీ 0.96 శాతం, జపాన్ సూచీ-నిక్కీ 1.72 శాతం, కొరియా సూచీ-కోస్పీ 1.24 శాతం లాభపడ్డాయి.

ఇదీ చూడండి: అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం

ABOUT THE AUTHOR

...view details