తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు అమెరికా వీసా దెబ్బ.. కుదేలైన ఐటీ రంగ షేర్లు - వాణిజ్య వార్తలు

ఐటీ, బ్యాంకింగ్​ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడితో స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 216 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు క్షీణించింది.

మార్కెట్లకు అమెరికా వీసా దెబ్బ.. కుదేలైన ఐటీ రంగ షేర్లు

By

Published : Nov 22, 2019, 4:14 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. అమెరికా వీసా విధానాల మార్పు ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేడు కుదేలయ్యాయి. వీటికి తోడు బ్యాంకింగ్​ రంగంలో అమ్మకాల ఒత్తిడి నేటి నష్టాలకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 216 పాయింట్లు కోల్పోయింది.. చివరకు 40,359 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో..11,914 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,653 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,277 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,968 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,883 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​ 3.74 శాతం, ఎన్​టీపీసీ 2.35 శాతం, వేదాంత 2.27 శాతం, ఓఎన్​జీసీ 2.14 శాతం, పవర్​ గ్రిడ్​ 1.53 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.14 శాతం లాభాలను గడించాయి.
ఇన్ఫోసిస్​ 2.89 శాతం, టీసీఎస్​ 2.20 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.17 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 1.82 శాతం, కోటక్​ బ్యాంకు 1.68 శాతం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు స్వల్పంగా క్షీణించింది. డాలర్​తో మారకం విలువ 71.79కి చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.03 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 63.95 డాలర్లకు చేరింది.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన.. షాంఘై సూచీ మినహా.. టోక్యో, హాంకాంగ్​, సియోల్​ సూచీలూ నేడు లాభాలతో ముగిశాయి.

ఇదీ చూడండి:'ఉపసంహరణ' ద్వారా 'ప్రైవేటీకరణ'పై ప్రయోగం!

ABOUT THE AUTHOR

...view details