తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, వాహన రంగాల్లో ఒత్తిడి.. నష్టాల్లో మార్కెట్లు - నేటి స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 139 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి.

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 31, 2019, 10:07 AM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కీలక రంగాల్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతుండటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. విదేశీ మదుపరులు సంవత్సరాంతపు సెలవుల్లో ఉండటం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ, ప్రైవేట్​ బ్యాకింగ్, వాహన రంగ షేర్లు అధికంగా నష్టాల్లో ఉన్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 139 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 41,418 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 42 పాయింట్లకు పైగా క్షీణతతో..12,213 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

యాక్సిస్​ బ్యాంకు, హెచ్​యూఎల్​, ఎల్​&టీ, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్​, టాటా స్టీల్​, కోటక్​ బ్యాంకు, హీరో మోటార్స్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:వొడాఫోన్ ఐడియాకు షాక్​.. నవంబరులో కోట్ల మంది ఔట్​!

ABOUT THE AUTHOR

...view details