తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనా' భయాలతో మదుపరుల అప్రమత్తత.. నష్టాల్లో సూచీలు - స్టాక్​ మార్కెట్​ వార్తలు తెలుగు

స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు మదుపరులు. సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ 45 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది.

stocks
స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 30, 2020, 9:48 AM IST

Updated : Feb 28, 2020, 12:08 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్​పై సానుకూల అంచనాలతో చివరి సెషన్​లో కాస్త తేరుకున్నట్లు కనిపించినా.. కరోనా ఆందోళనలు అంతకంతకూ పెరుగుతుండటం నేటి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 176 పాయింట్లకు పైగా నష్టంతో.. 41,021 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్లకు పైగా క్షీణతతో 12,084 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఎన్​టీపీసీ, టీసీఎస్​, పవర్ గ్రిడ్​, హీరో మోటోకార్ప్, హెచ్​సీఎల్​టెక్​, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, రిలయన్స్, నెస్లే, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:ఆర్థికమంత్రి ముందున్న సవాల్​.. వృద్ధిరేట్లకు ఊతమెలా?

Last Updated : Feb 28, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details