స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా రంగాల్లో సానుకూలత.. రికార్డు స్థాయి లాభాలకు దన్నుగా నిలిచాయి. మిడ్ సెషన్లో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో చివరకు లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 199 పాయింట్లు పుంజుకుంది. చివరకు 41,021 వద్ద జీవనకాల గరిష్ఠం వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో..12,101 వద్ద జీవనకాల గరిష్ఠం వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,076 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,849 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,115 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం).. 12,055 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.