తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా-మిస్త్రీ వివాదంపై నేడే సుప్రీం విచారణ

టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదంపైనేడు నేడు సుప్రీం కోర్టులో వాదనలు జరగనున్నాయి. సైరస్ మిస్త్రీని ఛైర్మన్​గా పునర్నియమించాలని ఎన్​సీఎల్​ఏటీ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ అత్యన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

tata
టాటా సన్స్ కేసు

By

Published : Jan 10, 2020, 7:23 AM IST

Updated : Jan 10, 2020, 7:44 AM IST

టాటా సన్స్-సైరస్​ మిస్త్రీ కేసులో జాతీయ కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్​ (ఎన్​సీఎల్​ఏటీ) తీర్పును సవాల్​ చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గత ఏడాది డిసెంబర్ 18న టాటా సన్స్ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీని పునర్నియమించాలని 'ఎన్​సీఎల్​ఏటీ' తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ 'టాటా సన్స్' పిటిషన్​ వేసింది. ఈ వాజ్యంపై​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని జస్టిస్​ బీ.ఆర్​. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​లతో కూడిన ధర్మాసనం ఎదుట నేడు వాదనలు జరగనున్నాయి. ఇరు పక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.అధికారిక వర్గాల సమాచారం మేరకు సీనియర్ న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ, హరీశ్​ సాల్వీ, ముకుల్​ రొహట్గీ, మోహన్​ పరసరన్​లు టాటా సన్స్​ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పుపై వీరు స్టే కోరనున్నట్లు తెలుస్తోంది.సైరస్​ ఇన్వెస్ట్​మెంట్ ప్రైవేట్​ లిమిటెడ్​, మిస్త్రీల తరఫున.. ఎన్​సీఎల్​ఏటీ తీర్పును సమర్ధిస్తూ.. సీనియర్​ న్యాయవాది ఎస్​.ఏ.సుందరం, అరవింద్​ దాతర్​, శ్యామ్​ డెవిన్​, సోమశేఖర్ సుదర్శన్​లు వాదించనున్నారు.
Last Updated : Jan 10, 2020, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details