తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్యూచర్​-అమెజాన్​ కేసులో సుప్రీం స్టే

రిలయన్స్ రిటైల్​తో ఫ్యూచర్​ గ్రూప్​ చేసుకున్న ఒప్పందంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏప్రిల్ 8న సుప్రీంకోర్టును ఆశ్రయించింది అమెజాన్. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను మే 4కు వాయిదా వేసింది.

Amazon Future case
ఫ్యూచర్​-అమెజాన్

By

Published : Apr 19, 2021, 6:40 PM IST

రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూపు విలీనానికి సంబంధించి దిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో అన్ని అభ్యర్ధనలను పూర్తి చేయాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. విచారణను మే 4కు వాయిదా వేసింది. ఈ​ వివాదంలో దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏప్రిల్ 8న సుప్రీంకోర్టును ఆశ్రయించింది అమెజాన్.

ఈ మేరకు జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హృషీకేశ్ రాయ్​లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్(ఎఫ్‌ఆర్‌ఎల్)​ తన వాటా రూ.24,713 కోట్లను రిలయన్స్​ రిటైల్​కు విక్రయించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై యథాఫూర్వ స్థితి కొనసాగుతుందని దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020 మార్చి 18 నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన డివిజన్ బెంచ్.. ఫ్యూచర్‌ గ్రూపునకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకించిన అమెజాన్​.. చట్టవిరుద్ధం, అసమాన, తీర్పుగా పేర్కొంది.

ఇవీ చదవండి:దిల్లీ హైకోర్టులో ఫ్యూచర్ గ్రూప్​న​కు ఊరట

అమెజాన్​తో వివాదంలో 'ఫ్యూచర్'​కు ఊరట

ABOUT THE AUTHOR

...view details