తెలంగాణ

telangana

ETV Bharat / business

మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ ఆదేశాలపై సుప్రీం స్టే - టాటా తాజా వార్తలు

mistry
mistry

By

Published : Jan 10, 2020, 12:01 PM IST

Updated : Jan 10, 2020, 12:36 PM IST

11:57 January 10

టాటా సన్స్​ సీఈఓగా సైరస్ మిస్త్రీని పునర్​ నియమించాలన్న జాతీయ కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ)​ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మిస్త్రీతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు. 

ఎన్​సీఎల్ఏ​టీ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు అంగీకరించిన సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

ఎన్​సీఎల్ఏ​టీ.. సైరస్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్రైవేట్ లిమిటెడ్​, మిస్త్రీకి ఊరట కల్పిస్తూ డిసెంబర్​ 18న తీర్పును ఇచ్చింది. మిస్త్రీని పునర్​ నియమించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్​ సుప్రీంను ఆశ్రయించింది. 

ఆర్​ఓసీ విజ్ఞప్తి తిరస్కరణ

తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇచ్చారని, తీర్పులో మార్పులు చేయాలని రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​(ఆర్ఓసీ).. ఎన్​సీఎల్​ఓటీకి పిటిషన్​ ఇచ్చింది. అయితే ఈ పిటిషన్​ను ఈ నెల 6న ఎన్​సీఎల్​ఏటీ కొట్టివేసింది.

Last Updated : Jan 10, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details