తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​కు షాక్- అందుకు సుప్రీం నో! - ఈ-కామర్స్​ సంస్థల వినతిని తిరస్కరించిన సుప్రీం కోర్టు

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోటీ చట్టాల ఉల్లంఘనపై సీసీఐ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme court on CCI investigation
సీసీఐ విచారణపై సుప్రీం తీర్పు

By

Published : Aug 9, 2021, 2:02 PM IST

Updated : Aug 9, 2021, 3:50 PM IST

పోటీ చట్టాల ఉల్లంఘన ఆరోపణలతో అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​పై.. కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ) దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విచారణను అడ్డుకోవాలంటూ ఆయా సంస్థలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే విచారణలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు నాలుగు వారాలు గడువు పెంచింది అత్యున్నత న్యాయస్థానం.

విచారణ ఎందుకు?

ఆఫర్లు, విక్రయాల విషయంలో ఈ-కామర్స్ సంస్థలు ఎంపిక చేసిన వ్యాపారులకు మాత్రమే ప్రాధ్యాన్యమిస్తున్నాయని.. దీని ద్వారా పరోక్షంగా నియంత్రణకు పాల్పడుతున్నాయని.. దిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​ సీసీఐకి గత ఏడాది ఫిర్యాదు చేసింది. దీనితో 2020 జనవరిలో సెక్షన్​ 26(1) కింద ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ఈ విచారణను అడ్డుకోవాలని ఈ-కామర్స్​ సంస్థలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే సీసీఐ దర్యాప్తును అడ్డుకోవాలన్న వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజాగా అక్కడ కూడా ఆయా సంస్థలకు ప్రతికూలంగా నిర్ణయం వెలువడింది.

ఇదీ చదవండి:వొడాఫోన్‌ ఐడియాను నిలబెట్టేందుకు కేంద్రం కసరత్తు

Last Updated : Aug 9, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details