తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏజీఆర్​ కేసులో వొడాఫోన్​కు మరో షాక్​ - agr dues

ఏజీఆర్​ బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామన్న వొడాఫోన్​ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంస్థ​ అభ్యర్థించగా న్యాయస్థానం తోసిపుచ్చింది.

SC-AGR-VODAFONE
వొడాఫోన్​

By

Published : Feb 17, 2020, 1:06 PM IST

Updated : Mar 1, 2020, 2:47 PM IST

వొడాఫోన్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏజీఆర్​ బకాయిలకు సంబంధించి ఆ సంస్థ​ ప్రతిపాదనను న్యాయస్థానం తిరస్కరించింది. ఇవాళ రూ.2,500 కోట్లు, శుక్రవారం మరో రూ.1,000 కోట్లు జమ చేస్తామని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అభ్యర్థించగా కోర్టు నిరాకరించింది.

వొడాఫోన్​ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.

"వొడాఫోన్​ ఈ రోజు రూ.2,500 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. మరో 1,000 కోట్లను శుక్రవారం చెల్లిస్తుంది. కానీ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అభ్యర్థిస్తున్నాం. బ్యాంకు పూచీకత్తుగా ప్రభుత్వానికి జమ చేసిన మొత్తాన్ని జప్తు చేయవద్దు."

-ముకుల్ రోహత్గీ, వొడాఫోన్ తరఫు న్యాయవాది

ఇదీ చూడండి:టెలికాం శాఖకు 10 వేల కోట్లు చెల్లించిన ఎయిర్​టెల్​

Last Updated : Mar 1, 2020, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details