టెల్కోలు ఏజీఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించే విషయంలో టెలికాం శాఖ (డీఓటీ) నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. టెల్కోలపై బలవంతపు చర్యలు తీసుకోరాదనే ఆదేశాలను ఇవాళ ఉపసంహరించుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
టెలికాం సంస్థలు, ఇతరులు ఏజీఆర్ బకాయిలు చెల్లించకపోయినా వారిని బలవంతపెట్టవద్దని డీఓటీ డెస్క్ అధికారి... ఆటార్నీ జనరల్, ఇతర రాజ్యాంగ అధికారులకు లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది డీఓటీ.
సుప్రీం ఆగ్రహం..
తమ తీర్పుపై డీఓటీ డెస్క్ స్టే విధించడాన్ని ఉదయం తప్పుబట్టింది న్యాయస్థానం. బకాయిల విషయంలో టెల్కోలు కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా గడువులోపు టెలికాం విభాగానికి చెల్లించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించింది.