తెలంగాణ

telangana

ETV Bharat / business

బీఎస్​4 వాహనాల అమ్మకానికి గడువు పెంపు

దేశ రాజధాని ప్రాంతం-దిల్లీలో మినహా ఇతర ప్రాంతాల్లో బీఎస్​-4 వాహనాలను అమ్ముకోవడానికి గడువు తేదీని పెంచుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్​డౌన్​ ఎత్తివేసిన అనంతరం 10 రోజుల పాటు విక్రయానికి అనుమతిచ్చింది.

SC extends time for sale of unsold inventory of BS-IV vehicles barring Delhi-NCR
బీఎస్​4 వాహనాల అమ్మకానికి మరో 10రోజులు గడువు

By

Published : Mar 27, 2020, 7:33 PM IST

కరోనా లాక్​డౌన్​ అనంతరం దేశ రాజధాని ప్రాంతం మినహా మిగిలిన చోట్ల 10 రోజుల పాటు బీఎస్​-4 వాహనాలను విక్రయించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో బీఎస్​-4 వాహనాలను దేశవ్యాప్తంగా అమ్ముకోవడానికి 2020 మార్చి 31ని గడువు తేదిగా నిర్ణయించింది సుప్రీం. అయితే ఆర్థిక మాంద్యం, కరోనా ప్రభావం వల్ల అమ్మకాలు క్షీణించాయని మరికొన్ని రోజులు గడువు పెంచాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ ఆసోసియేషన్ ​(ఎఫ్​ఏడీఏ).

జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ దీపక్​ గుప్తాలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా ఈ అభ్యర్థనపై విచారణ జరిపింది. ఏదేమైనా దేశ రాజధాని ప్రాంతంలో బీఎస్​-4 వాహనాలు విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

బీఎస్​4 వాహనాలు నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా 2017 ఏప్రిల్​ నుంచి వీటిని నిషేధించారు.

ఇదీ చూడండి:'అంతరాయం లేకుండా ఆసుపత్రులకు ఆక్సిజన్​ సరఫరా'

ABOUT THE AUTHOR

...view details