తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏజీఆర్​ రివ్యూ పిటిషన్​పై టెల్కోలకు సుప్రీం షాక్

ఏజీఆర్​ వివాదంపై రివ్యూ పిటిషన్​ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్, వొడాఫోన్-ఐడియాలు దాఖలు చేసిన ఈ పిటిషన్​కు విచారణ అర్హత లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించక తప్పదు!

AGR
ఏజీఆర్​

By

Published : Jan 16, 2020, 7:11 PM IST

Updated : Jan 16, 2020, 7:33 PM IST

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) వివాదంలో టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన తీర్పుపై టెలికాం సంస్థలు ఎయిర్​టెల్​, వొడాఫోన్-​ఐడియాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను తిరస్కరించింది అత్యున్నత న్యాయస్థానం. 2019 అక్టోబర్​ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో ఏజీఆర్​పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్​ ఎస్​ ఏ నజీర్, జస్టిస్​ ఎం ఆర్​ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్​కు రివ్యూ విచారణ అర్హతలేదని అభిప్రాయపడింది.

రివ్యూ పిటిషన్​ను ఓపెన్​ కోర్టులో విచారించాలని టెలికాం సంస్థలు అభ్యర్థించగా.. సుప్రీం కోర్టు మాత్రం ఇన్​-చాంబర్​లో పరిశీలనకు చేపట్టింది.

బకాయిల వివరాలు ఇలా..

నవంబర్​లో జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో.. టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్​ భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-​ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయిపడ్డట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ అపరాధ రుసుములపై వడ్డీ తగ్గించే ప్రతిపాదనేదీ లేదనే విషయాన్నీ వెల్లడించారు.

టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఈ బకాయిలలో రూ.92,642 కోట్లు చెల్లింపులు చేయని లైసెన్సు రుసుములు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్​ వినియోగ బకాయిలుగా పేర్కొన్నారు రవి శంకర్ ప్రసాద్​.

కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..

  • ఎయిర్​టెల్ రూ.21,682.13 కోట్లు
  • వొడాఫోన్ రూ.19,823.71 కోట్లు
  • ఆర్​కాం రూ.16,456.47 కోట్లు
  • బీఎస్​ఎన్​ఎల్​ రూ.2,098.72 కోట్లు
  • ఎంటీఎన్​ఎల్​ రూ.2,537.48 కోట్లు

సుప్రీం తీర్పుపై ఎయిర్​టెల్​ స్పందన

సుప్రీం కోర్టు తీర్పు నిరాశపరిచినట్లు టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ ప్రకటించింది. దీనిపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఏజీఆర్​ వివాదంపై మరిన్ని వివరాలుకు ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Jan 16, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details