తెలంగాణ

telangana

ETV Bharat / business

సహ చట్టానికి తలొగ్గాల్సిందే: ఆర్బీఐకి సుప్రీం - బ్యాంకుల తనిఖీ వివరాలు

బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికకు సంబంధించిన సమాచారన్ని ఆర్​టీఐ పిటీషనర్లకు ఇవ్వాల్సిందేనని ఆర్​బీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఆర్బీఐ

By

Published : Apr 26, 2019, 4:38 PM IST

రిజర్వు బ్యాంకుకు సుప్రీం కోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదిక వివరాలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయాలని స్పష్టంచేసింది.

వివరాల బహిర్గతంపై ఇప్పటికే ఓసారి ఆదేశాలు జారీ చేసిన కారణంగా... ఆర్బీఐకి ఇది చివరి అవకాశమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ మేరకు ఆర్బీఐ విధానాలను పునఃసమీక్షించుకోవాలని జస్టిస్ ఎల్​. నాగేశ్వర్​ రావు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

ఇదీ నేపథ్యం

బ్యాంకుల వార్షిక తనిఖీ వివరాలు, నిబంధనల ఉల్లంఘన కింద కొన్ని బ్యాంకులకు విధించిన అపరాధ రుసుముకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ ఆర్​టీఐ కార్యకర్త ఎస్​సీ అగర్వాల్ ఆర్బీఐకి ఆర్జీ పెట్టుకున్నారు.

ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు ఆర్​బీఐ నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఇలాంటి సమాచారం ఇవ్వడం కుదరదని చెప్పింది. ఈ విషయంపై అగర్వాల్​ సుప్రీంను ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details