ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా తగ్గించింది. అన్ని రకాల రుణాలపై 5 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు వెల్లడించింది. తగ్గిన వడ్డీ రేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్ల తగ్గింపు
భారతీయ స్టేట్ బ్యాంక్ తమ రుణగ్రహీతలకు శుభవార్త ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
ఎస్బీఐ
ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది ఏడోసారి. తాజా ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో.. వడ్డీ రేట్లు 8 శాతానికి రానున్నాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలతో ఉపయోగమెంత..?