ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం కోసం తాము ఎదురుచూడట్లేదని స్పష్టం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి అదనపు నిధులు అవసరం లేదని పేర్కొంది. తమ వద్ద సరిపడా మూలధనం ఉందని చెప్పారు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అర్జిత్ బసు.
మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్బీఐ
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తమ వద్ద ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా మూలధనం ఉందని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు గత శుక్రవారం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
టైర్-1, టైర్-2 బాండ్లకు ప్రణాళికలను కూడా ప్రకటించేశామన్న బసు.. మూలధనం పెంచుకునేందుకు నాన్ కోర్ ఆస్తుల్ని విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మూలధన సాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర బ్యాంకులకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.