తెలంగాణ

telangana

నికర లాభాలతో దూసుకుపోతున్న ఎస్​బీఐ

By

Published : Aug 2, 2019, 5:41 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్​బీఐ రూ.2,312 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంకుకు వస్తున్న అధిక ఆదాయాలకు తోడు, మొండి బకాయిలు తగ్గడం కూడా ఇందుకు కారణం.

నికర లాభాలతో దూసుకుపోతున్న ఎస్​బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ (భారతీయ స్టేట్​ బ్యాంకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,312 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. అధిక ఆదాయానికి తోడు మొండి బకాయిల తగ్గింపు చర్యలే ఇందుకు కారణం.

2018-19 ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో ఎస్​బీఐ రూ.4,875.85 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

స్టాక్​ ఎక్స్ఛేంజ్​ల్లో ఎస్​బీఐ పోస్టు చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం, 2019-20లో బ్యాంకు స్థిర ఆదాయం రూ.70,653.23 కోట్లకు పెరిగింది.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.65,492.67 కోట్లుగా ఉంది.

ఎస్​బీఐకి.... గతేడాది జూన్​ చివరినాటికి 10.69 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ), ఈ జూన్ చివరినాటికి 7.53 శాతానికి తగ్గాయి. అదే విధంగా 2018లో 5.29 శాతంగా ఉన్న నికర ఎన్​పీఏలు, 2019 నాటికి 3.07 శాతానికి తగ్గాయి.

ప్రస్తుతం ఎస్​బీఐ షేర్లు బీఎస్​ఈలో ఒక్కోటి రూ.319.45 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: భారీ నష్టాల నుంచి లాభాల బాటలోకి..


ABOUT THE AUTHOR

...view details