గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం 4 రెట్లు పెరిగింది. జనవరి-మార్చి మధ్య మూడు నెలల కాలంలో రూ.3,580.81 కోట్లు గడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం రూ.838.4 కోట్లుగా ఉంది.
2019-20 జవవరి-మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ ఆదాయం కూడా భారీగా రూ.76,027.51 కోట్లకు పెరిగింది. 2018-19 ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.75,650.5 కోట్లుగా ఉంది.