ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ 2020-21 చివరి త్రైమాసికంలో రూ.6,450.75 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2019-20 ఇదే సమయంలో నమోదైన రూ.3,580.81 కోట్ల లాభంతో పోలిస్తే ఈ మొత్తం 80 శాతం ఎక్కువ.
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.81,326.96 కోట్లుగా నమోదైంది. 2019-20 ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.76,027.51 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది మార్చి 31 నాటి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 6.15 శాతం(2020 మార్చి 31 నాటికి) నుంచి 4.98 శాతానికి మెరుగైనట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇదే సమయంలో నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.23 శాతం నుంచి.. 1.50 శాతానికి దిగొచ్చినట్లు వివరించింది.