తెలంగాణ

telangana

ETV Bharat / business

Sbi Alert: ఎస్​బీఐ వినియోగదారులకు హెచ్చరిక

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ తమ కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది. టెక్నికల్ అప్​గ్రేడింగ్ కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చని వెల్లడించింది. ఏ సమయంలో.. ఏఏ సేవలకు అంతరాయం ఏర్పడనుంది అనే వివరాలు ఇలా ఉన్నాయి.

SBI Services will stop some time today
ఎస్​బీఐ సేవల్లో తాత్కాలిక అంతరాయం

By

Published : Jul 16, 2021, 11:47 AM IST

Updated : Jul 16, 2021, 12:51 PM IST

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే, బ్యాంకు మీకు ఓ ముఖ్య గమనిక జారీ చేసింది. కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జులై 16 అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి మెసేజ్‌లు, అలర్ట్‌లపై క్లిక్‌ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. కస్టమర్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏ సమయంలో? ఏయే సేవలు?

జులై 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. మొత్తం రెండున్నర గంటల పాటు సేవలు ఆగిపోనున్నాయి.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనోలైట్‌, యూపీఐ సేవలకు అంతరాయం కలగనుంది.

ఇదీ చదవండి:భారత్​లో 20 లక్షల ఖాతాలపై వాట్సప్​ నిషేధం

Last Updated : Jul 16, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details