తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ

అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ. తగ్గిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్​ 10 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.

ఎస్​బీఐ

By

Published : Apr 9, 2019, 7:54 PM IST

అన్ని రగాల రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్​ పాయింట్ల మేర తగ్గించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ. తగ్గిన వడ్డీ రేట్లు ఏప్రిల్​ 10 నుంచి అమలవుతాయని ఎస్​బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

సవరించిన మార్జినల్​ కాస్ట్​ ఆఫ్​ ఫండ్స్​ బేస్​డ్​ లెండిగ్​ రేట్​ (ఎంసీఎల్​ఆర్​)లతో 8.55 శాతానికి వడ్డీ రేటు తగ్గనుంది. ప్రస్తుతం ఎంసీఎల్​ఆర్​ 8.55 శాతంగా ఉంది.

వీటితో పాటు రూ.30 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు 8.60 నుంచి 8.90 శాతం మధ్య ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీ రేట్లు 8.70 నుంచి 9.0 శాతం మధ్య ఉన్నాయి.

ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details