తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ మోసాలు నియంత్రించే ఎస్​బీఐ వర్చువల్​ కార్డు - ఎస్​బీఐ వర్చువల్ కార్డు లేటెస్ట్

ఇటీవల ఆన్​లైన్​ మోసాలు పెరిగన నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాత్కాలికంగా లావాదేవీలకు ఉపయోగపడే వర్చువల్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఇదెలా పని చేస్తుంది. దీన్ని పొందడం ఎలా పూర్తి వివరాలు మీ కోసం.

ఎస్​బీఐ
sbi

By

Published : Jan 24, 2020, 7:38 PM IST

Updated : Feb 18, 2020, 6:51 AM IST

ఆన్​లైన్​లో జరిగే మోసపూరిత లావాదేవీలను నివారించేందుకు 'భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్​బీఐ)' సరికొత్త వర్చువల్​ కార్డ్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పరిమితితో కూడిన డెబిట్​ కార్డ్​ లాగా పని చేస్తుంది. ఈ-కామర్స్ వెబ్​సైట్లలో వీసా కార్డులలానే ఈ వర్చువల్​ డెబిట్​ కార్డును వినియోగించుకునే వీలుంది.

వర్చువల్​ కార్ట్​లో మరిన్ని ఫీచర్లు..

  • ఎస్​బీఐ వర్చువల్​ కార్డు, మర్చంట్​ వద్ద ప్రైమరీ కార్డు, ఖాతా వివరాలు గోప్యంగా ఉంచుతుంది. ఇది మోసాల బారిన పడకుండా నియంత్రిస్తుంది.
  • వర్చువల్​ కార్డు లావాదేవీలు పూర్తయ్యే వరకు.. 48 గంటల పాటు పని చేస్తుంది.
  • ఓటీపీ ద్వారా వర్చువల్​ కార్డును క్రియేట్​ చేసుకోవచ్చు.
  • కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.50,000 పరిమితి వరకు ఎస్​బీఐ వర్చువల్​ కార్డు క్రియేట్ చేసుకునే వీలుంది.
  • వీసా కార్డులను అనుమతించే ఏ ఆన్​లైన్ వెబ్​సైట్లలోనైనా ఈ వర్చువల్ కార్డును వినియోగించుకోవచ్చు.
  • ఇది సింగిల్ యూజ్​ కార్డు అంటే ఒక సారి వినియోగించిన తర్వాత మళ్లీ పనిచేయదు.

ఎలా క్రియేట్​ చేసుకోవాలి..

  • ముందు ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్​కు లాగిన్​ అవ్వాలి
  • అందులో ఈ కార్ట్​ను ఎంచుకోవాలి.. ఆ తర్వాత జెనరేట్​ వర్చువల్​ కార్డ్​ను క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత ఏ ఖాతా నుంచి, ఎంత మొత్తంలో నగదు పంపించాలో వంటి ఆప్షన్​లను ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత నిబంధనలన్నీంటిని అంగీకరించి.. అప్పుడు జెనరేట్ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అపుడు కార్డుదారుని పేరు, డెబిట్​ కార్డు ఖాతా సంఖ్య, వర్చువల్​ కార్డ్​ పరిమితివంటి వాటిని ధ్రువీకరించాలి.
  • అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్​ నంబర్​కు ఎస్​బీఐ నుంచి ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఇచ్చి కన్​ఫార్మ్​పై క్లిక్​ చేస్తే.. అప్పుడు మీకు వర్చువల్​ కార్డు నంబర్, ఎక్స్​పైరీ తేదీ వంటివి కనిపిస్తాయి.
  • ఈ నంబర్​ను ఆన్​లైన్​ షాపింగ్​ కోసం వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి:టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే

Last Updated : Feb 18, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details