భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గృహ రుణాల వ్యాపారం రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటినట్లు బుధవారం ప్రకటించింది. రియల్ ఎస్టేట్, హౌసింగ్ వ్యాపారాలు (ఆర్ఈహెచ్బీయూ) గత పదేళ్లలో ఐదింతలైనట్లు వెల్లడించింది.
2011లో ఈ విభాగం అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రూ.89,000 కోట్లుగా ఉంటే.. ఇప్పుడది రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటినట్లు వివరించింది ఎస్బీఐ. 2024 నాటికి రూ.7 లక్షల కోట్ల ఏయూఎంను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.