ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఎస్బీఐ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కనెక్టివిటీలో సాంకేతిక సమస్యల వల్ల.. సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలు మినహా.. మిగతా అన్ని సేవలపైన ఈ ప్రభావం పడినట్లు వివరించింది.