దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరోసారి మడత ఫోన్‌తో మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అడ్డంగా మడపెట్టే స్మార్ట్ ఫోన్ 'గెలాక్సీ ఫోల్డ్'ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన శాంసంగ్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో మోడల్‌ను తీసుకురానుంది. అయితే ఈ సారి నిలువుగా మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌తో వచ్చేందుకు శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. వర్టికల్‌గా మడతబెట్టే ఫోన్లు అభివృద్ధి చేస్తున్నట్లు శాంసంగ్ ఇదివరకే అధికారికంగా ప్రకటించింది.
తాజాగా వర్టికల్ ఫోల్డబుల్ ఫోన్ విడుదలపై పలు రకరకాల ఊహాగానాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఈ కొత్త ఫోన్‌ను అవిష్కరించాలని శాంసంగ్ నిర్ణయించినట్లు సమాచారం.
మార్కెట్లో ఇప్పటికే వర్టికల్ ఫోల్డబుల్ ఫోన్..
లెనోవో గ్రూపులో భాగమైన మోటో సంస్థ ఇప్పటికే 'రేజర్' పేరుతో నిలువుగా మడబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. శాంసంగ్ కన్నా ముందుగానే వచ్చే ఏడాది జనవరిలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు టెక్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. మడతఫోన్ల సెగ్మెంట్లో శాంసంగ్ వర్టికల్ ఫోన్‌కు.. మోటో రేజర్‌కు మధ్య గట్టి పోటీ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
శాంసంగ్ వర్టికల్ ఫోల్డ్ అంచనాలు..
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ కొత్త మోడల్‌ను 'శాంసంగ్ డబ్ల్యూ20 5జీ'గా మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి.
మరికొన్ని టెక్ వార్తా సంస్థలు.. గెలాక్సీ ఫోల్డ్ 2 పేరుతో కొత్త మోడల్‌ను ఆవిష్కరించే అవకాశముందని అంటున్నాయి.
ఇదీ చూడండి:ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి ఆనంద్ మహీంద్రా గుడ్ బై!