తెలంగాణ

telangana

ETV Bharat / business

శాంసంగ్​ నుంచి ప్రీమియం ఫీచర్లతో రెండు బడ్జెట్ ఫోన్లు - శాంసంగ్ బడ్జెట్​ ఫోన్లు

శాంసంగ్​ నుంచి త్వరలో రెండు ప్రీమియం ఫీచర్లు కలిగిన బడ్జెట్​ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. గెలాక్సీ ఎస్​10, గెలాక్సీ నోట్​ 10లను ప్రతిబింబించేలా కొత్త మోడళ్లను తీసుకురానుంది ఆ సంస్థ. కొత్త మోడల్​ ఫీచర్ల ఇతర వివరాలు మీ కోసం.

SAMSUNG
శాంసంగ్​

By

Published : Jan 4, 2020, 3:21 PM IST

Updated : Jan 4, 2020, 5:04 PM IST

ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్​ ధరలో రెండు కొత్త స్మార్ట్​ఫోన్లు తెచ్చేందుకు సిద్ధమైంది శాంసంగ్​. ఇందు కోసం సరికొత్త గెలాక్సీ ఎస్​10 టైట్, గెలాక్సీ నోట్​ 10 లైట్​ స్మార్ట్​ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ.

ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లలో.. 2019లో వచ్చిన ఫ్లాగ్​షిప్​ మోడళ్లలోని సరికొత్త ఫీచర్లు ఉండనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఈ కొత్త మోడల్​ ఫోన్లు.. గెలాక్సీ ఎస్​ 10, గెలాక్సీ నోట్​ 10ల అనుభూతిని బడ్జెట్​ ధరలో అందిస్తాయని శాంసంగ్​ అధ్యక్షుడు, సీఈఓ (ఐటీ, మొబైల్​), డీజే కోన్​ తెలిపారు.

ఈ రెండు మోడళ్లను.. లాస్​ వేగాస్​లో వచ్చే మంగళవారం జరగనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్​ షో (సీఈఎస్) 2020లో ప్రదర్శించనుంది శాంసంగ్​.

కొత్త మోడళ్ల ఫీచర్లు..

  • గెలాక్సీ ఎస్​10, గెలాక్సీ నోట్​10 లైట్​లలో.. ఎడ్జ్​-టూ-ఎడ్జ్​ ఇన్ఫినిటీ-ఓ-డిస్​ప్లేలు ఉండనున్నాయి.. డిస్​ప్లే పరిమాణం 6.7 అంగుళాలు ఉండనుంది. ఈ రెండు కొత్త మోడళ్లు 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో రానున్నాయి.
  • ఈ స్మార్ట్​ఫోన్లలో..శాంసంగ్​ ఎకో సిస్టమ్​ యాప్​లైన బిక్స్​ బీ, శాంసంగ్ పే, శాంసంగ్ హెల్త్​లు ఉండనున్నాయి.
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్​10 లైట్..​ ప్రిసమ్​ వైట్​, ప్లిసమ్​ బ్లూ, గెలాక్సీ నోట్​ 10 లైట్.. ఆరా గ్లో, ఆరా బ్లాక్, ఆరా రెడ్ రంగుల్లో లభ్యం కానున్నాయి.
  • మిగతా ఫీచర్లూ.. దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్​10, గెలాక్సీ నోట్​ 10 ​లను పోలి ఉండనున్నాయి.

ఇదీ చూడండి:2019లో భారీగా తగ్గిన యాపిల్ సీఈఓ వేతనం

Last Updated : Jan 4, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details