ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) తమ సంస్థ ఆపరేటింగ్ లాభం 23 శాతం పెరగొచ్చని ఎలక్ట్రానిక్ ఉపకరణాల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్లలో వాడే చిప్ సెట్లకు డిమాండ్ భారీగా పెరగటం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. గత త్రైమాసికానికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలను ఈ నెలాఖరున ప్రకటించనుంది శాంసంగ్.
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వంటివి ఇవ్వడం, విద్యార్థులు ఆన్లైన్ క్లాస్‌లు వింటుండటం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ అవకాశాలను శాంసంగ్ సరిగ్గా అందిపుచ్చుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసిక అంచనాలు ఇలా..