తెలంగాణ

telangana

ETV Bharat / business

దృశ్యం ఇక అపూర్వం- 8కే తెరతో అదిరే టీవీలు

టీవీ కొనాలని చూస్తున్నారా? హై ఎండ్​ సాంకేతికతతో 4కే తీసుకుందామని ప్లాన్​ చేస్తున్నారా? కాస్త ఆగండి. ఈ ఏడాది 8కే తెరతో టీవీలు రాబోతున్నాయి. వినూత్న ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు అదరగొట్టే దిగ్గజ సంస్థలు శాంసంగ్​, ఎల్​జీ అత్యాధునిక టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నాయి.

ces 2020
ces 2020

By

Published : Jan 7, 2020, 4:18 PM IST

8కే తెరతో అదిరే టీవీలు

4కే.. ఇప్పటివరకు మనకు తెలిసిన పూర్తి స్పష్టమైన తెర. ఇక ఈ సాంకేతికతకు స్వస్తి పలికేందుకు 8కే తెరతో ముందుకు రానున్నాయి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు శాంసంగ్, ఎల్​జీ. 8కేతోపాటు అనేక కొత్త అంశాలను జోడించి హై ఎండ్ టీవీలను అందించబోతున్నాయి.

అమెరికా లాస్​వెగాస్​లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన(సీఈఎస్​-2020)లో తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించాయి ఈ సంస్థలు.

శాంసంగ్​ 'సెరో'

సెరో పేరుతో 88 అంగుళాల 8కే స్మార్ట్​ టీవీని రూపొందించింది శాంసంగ్​. సెరో అంటే నిలువు అని కొరియా భాషలో అర్థం. ఈ టీవీని మొబైల్​ తరహాలో వర్టికల్​ మోడ్​లోనూ ఉపయోగించవచ్చు. ఇందుకోసం స్మార్ట్​ఫోన్​ను వైఫై ద్వారా టీవీకి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్​లో వర్టికల్​ మోడ్​లో ఉన్న వీడియోలను చూసేందుకు మీరు మొబైల్​ను తిప్పితే.. సెరో కూడా నిలువుగా మారుతుంది.

"మనం సాధారణంగా ఫోన్​ను నిలువుగానే ఉపయోగిస్తాం. ఈ వినియోగం కారణంగానే వీడియో చిత్రీకరణల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మొబైల్​లో ఎక్కువగా వర్టికల్​ మోడ్​లోనే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. అయితే నిలువుగా వీడియోలను ప్రదర్శించే సాంకేతికతను ఇప్పటివరకు ఏ టీవీ అందించలేదు."

-గ్రేస్​ డొలాన్​, శాంసంగ్​ ఉపాధ్యక్షులు, అమెరికా

సెరోతో పాటు క్యూ950 పేరుతో మరో 8కే క్యూఎల్​ఈడీ టీవీని ఆవిష్కరించింది శాంసంగ్​. ఈ మోడల్​లో 99శాతం స్క్రీన్​-బాడీ నిష్పత్తితో టీవీ తెరను రూపొందించింది.

ఎల్​జీ సిగ్నేచర్​

మరో దిగ్గజ సంస్థ ఎల్​జీ కూడా ఈ ఏడాది 8కే మార్కెట్​లో అడుగుపెట్టనుంది. ఈ ఏడాది మొత్తం 13 వేరియంట్లను అందించనుంది. ఇందులో హైఎండ్​ మోడల్​గా 88 అంగుళాలతో ఎల్​జీ సిగ్నేచర్​ను ఆవిష్కరించింది.

ప్రస్తుతానికి 8కే రిజల్యూషన్​తో ఎలాంటి వీడియోలు లేకున్నా రాబోయే కాలంలో డిమాండ్​ పెరిగే అవకాశం ఉందని ఎల్​జీ భావిస్తోంది. అందుకే ఈ ఏడాది 8కే టీవీలపై దృష్టి పెట్టినట్టు సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: శాంసంగ్​ నుంచి ప్రీమియం ఫీచర్లతో రెండు బడ్జెట్ ఫోన్లు

ABOUT THE AUTHOR

...view details