తెలంగాణ

telangana

ETV Bharat / business

విడుదలకు ముందే లీకైన గెలాక్సీ ఎం31 ధర! - శాంసంగ్ మొబైల్స్​

శాంసంగ్​ గెలాక్సీ ఎం30ఎస్​కు కొనసాగింపుగా ఎం31ను తీసుకొస్తోంది కొరియా దిగ్గజం. 64 ఎంపీల ప్రధాన కెమెరాతో రానున్న ఈ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ధర లీకైనట్లు సమాచారం. ఎం31 ప్రత్యేకతలను కూడా పలు టెక్​ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం..

samsung m31
శాంసంగ్ ఎం31

By

Published : Feb 21, 2020, 5:26 PM IST

Updated : Mar 2, 2020, 2:21 AM IST

శాంసంగ్​ ఈ నెల చివర్లో భారత్​ మార్కెట్లోకి విడుదల చేయనున్న మిడ్​ రేంజ్ స్మార్ట్​ ఫోన్​ గెలాక్సీ ఎం31. గతేడాది విడుదలై భారీ అమ్మకాలు సాధించిన గెలాక్సీ ఎం30ఎస్​కు ఇది కొనసాగింపుగా తెలుస్తోంది. దాదాపు అదే హార్డ్​వేర్​తో రూపొందిన ఎం31 ధర లీకైనట్లు సమాచారం.

గెలాక్సీ ఎం31 రెండు వేరియంట్లలో రానుంది. రెండింటిలోనూ 6జీబీ ర్యామ్​ ఉండగా.. 64జీబీ, 128జీబీ రామ్​ వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎం31ను ఫిబ్రవరి 25న భారత్​లో ఆవిష్కరించనుంది శాంసంగ్​. అయితే అమ్మకాలు మాత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని సమాచారం.

ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం 64జీబీ వేరియంట్​ ధర రూ.15,999 ఉంటుంది. 128జీబీకి రూ.16,999 ఉండవచ్చని అంచనా వేసింది.

ఎం31 స్పెసిఫికేషన్​ అంచనాలు..

6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + సూపర్ ఎమోలెడ్​ డిస్​ప్లే

ఎగ్జినోస్​ 9611 చిప్​సెట్​

వెనుక కెమెరా (64ఎంపీ+13ఎంపీ+5ఎంపీ+5ఎంపీ)

16ఎంపీ సెల్ఫీ కెమెరా

6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్​ 10

యూజర్ ఇంటర్​ఫేస్​ వన్​యూఐ 2.0

ఇదీ చూడండి:శాంసంగ్​ మడత ఫోన్​ ప్రీ-బుకింగ్​.. ధరెంతో తెలుసా?

Last Updated : Mar 2, 2020, 2:21 AM IST

ABOUT THE AUTHOR

...view details