తెలంగాణ

telangana

ETV Bharat / business

శామ్​సంగ్​ లాభాల్లో 60 శాతం తగ్గుదల - క్యూ1 ఫలితాలు

జనవరి నుంచి మార్చి మధ్య మూడు నెలల కాలానికి ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజం శామ్​సంగ్​ నిర్వహణ లాభాలు భారీగా తగ్గాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 60 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది శామ్​సంగ్​.

శామ్​సంగ్

By

Published : Apr 6, 2019, 2:00 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(దక్షిణ కొరియా) మొదటి త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్​సంగ్ నిర్వహణ​ లాభాలు 60 శాతం మేర తగ్గాయి.

జనవరి నుంచి మార్చి మధ్య మూడు నెలల కాలంలో నిర్వహణ లాభం 6.2 ట్రిలియన్​ వోన్​లు గడిచించినట్టు శామ్​సంగ్​ వెల్లడించింది. అదే కాలంలో 52 ట్రిలియన్​ వోన్​ల విలువైన ఉత్పత్తుల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. విపణిలో మందగమనం కారణంగా లాభాలు భారీగా తగ్గినట్లు సంస్థ పేర్కొంది. వోన్​ అనేది దక్షిణ కొరియా కరెన్సీ. ఒక రూపాయి 16.44 వోన్లకు సమానం.

ఉత్పత్తుల్లో లోపం కారణంగా వాటిని వెనక్కి రప్పించుకోవడం, సంస్థ అధినేతకు జైలు శిక్ష పడటం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది శామ్​సంగ్. అయినప్పటికీ గతేడాది వరకు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది ఈ దిగ్గజ సంస్థ.

అయితే ప్రపంచ వ్యాప్తంగా సరఫరా పెరిగి డిమాండు తగ్గడం వంటి కారణాలతో చిప్​ల ధరలు తగ్గి భారీగా నష్టపోయినట్లు పేర్కొంది శామ్​సంగ్​. యాపిల్​ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఫోన్ల విడిభాగాలను శాంమ్​సంగ్​ నుంచే కొనుగోలు చేస్తుండటం గమనార్హం.

శామ్​సంగ్ గ్రూపులో ప్రధానమైన భాగస్వామిగా ఉంది శామ్​సంగ్ ఎలక్ట్రానిక్స్​. ప్రపంచంలోనే 11వ అతిపెద్ద వ్యాపార దిగ్గజంగా దీనికి పేరుంది. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా శామ్​సంగ్​ ఉంది.

ABOUT THE AUTHOR

...view details