తెలంగాణ

telangana

ETV Bharat / business

'జియో మార్ట్​ అండతో 'ఫ్యూచర్'​ మెరుగు' - అమెజాన్

కరోనా విజృంభణతో మందకొడిగా సాగిన తమ వ్యాపారం త్వరలోనే పుంజుకుంటుందని ఫ్యూచర్​ గ్రూపు వ్యవస్థాపకుడు, సీఈఓ కిశోర్​ బియానీ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణ, అమెజాన్​తో కొనసాగుతున్న వివాదం, జియోతో ఒప్పందం వంటి కీలక అంశాలపై ఆయన పీటీఐ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Sales to normalise by Jan-end, getting orders from Jio Mart: Kishore Biyani
జియో నుంచి ఫ్యూచర్​కు ఆర్డర్ల వెల్లువ

By

Published : Jan 10, 2021, 5:21 PM IST

కరోనాతో గత సంవత్సర కాలంగా మందకొడిగా సాగిన అమ్మకాలు జనవరి చివరి నాటికి సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఫ్యూచర్ గ్రూప్ అంచనా వేస్తోంది. రిటైల్ రంగంలో అమ్మకాలు పుంజుకుంటాయని ఆ సంస్థ సీఈఓ కిశోర్​​ బియానీ తెలిపారు.

రిలయన్స్​తో కుదుర్చుకున్న ఒప్పందం(రూ.24,731కోట్లు) కారణంగా జియో మార్ట్ నుంచి వస్తున్న ఆర్డర్లు ఫ్యూచర్​ గ్రూపు వ్యాపార వృద్ధికి తోడ్పడ్డాయని తెలిపారు. త్వరలోనే కరోనాకు ముందున్న పరిస్థితులను చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

బిగ్ ​బజార్​, ఎఫ్​బీబీ, సెంట్రల్​, నీలగిరీస్​ వంటి ఫ్యూచర్​ గ్రూప్​ రిటైల్​ స్టోర్లలో 60 శాతం అమ్మకాలుపుంజుకున్నాయి. త్వరలోనేకరోనాకు ముందున్న అమ్మకాలు సాధిస్తాం . వ్యాపారాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లలోనూ మా షేరు ధర 80శాతం పెరిగింది.

-కిశోర్​ బియానీ, ఫ్యూచర్​ గ్రూప్ అధినేత

డిజిటల్​ విధానంలో వ్యాపారం..

సామాజిక దూరం నిబంధనలతో తమ వ్యాపారం పూర్తి స్థాయిలో సాగట్లేదని.. కరోనా టీకా అందరికీ చేరేవరకు 100శాతం లాభాలు ఆశించలేమని బియానీ అభిప్రాయపడ్డారు. 'పికప్​ ఎట్​ స్టోర్స్' పేరిట డిజిటల్​ రూపంలో కస్టమర్లను చేరుతున్నామని వివరించారు. జనవరి 26న 'సబ్​ సే సస్తా దిన్' రోజు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు.

చిన్న నగరాలకూ 'ఫ్యూచర్​'

బిగ్​బజార్​ హైపర్​ మార్కెట్ పేరిట లఖ్​నవూలో ఏర్పాటైన స్టోర్లను మధ్యశ్రేణి నగరాలకూ విస్తరించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. వీటిల్లో దుస్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు అధికంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జియోతో పాటు ఫ్యూచర్​ గ్రూప్​ వినియోగదారుల నుంచి క్రమంగా పెరుగుతున్న ఆర్డర్ల నేపథ్యంలో సప్లయి చెయిన్​ను పటిష్ఠ పరచుకోవాల్సిన అవసరాన్ని ఉద్యోగులకు రాసిన మెయిల్​లో బియానీ ప్రస్తావించారు.

ఫ్యూచర్​పై కోర్టుకు అమెజాన్​..

రిలయన్స్​-ఫ్యూచర్​ గ్రూపు ఒప్పందానికి నియంత్రణా సంస్థల అనుమతులు రావాల్సి ఉందని.. ఒప్పందం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు బియానీ. అమెజాన్​ వ్యవహారంపై ఎక్కువ సమయం వేచి చూడాలనుకోవట్లేదని వివరించారు. సెబీ అనుమతి పొందిన వెంటనే రుణదాతలు, వాటాదారుల ఆమోదం కోసం నేషనల్​ కంపెనీ లా ఆఫ్​ ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​టీ)లో దరఖాస్తు చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియకు 45-60 రోజులు సమయం పడుతుందని చెప్పారు.

గత ఏడాది ఆగస్టులో చేసుకున్న ఈ ఒప్పందంపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో అమెజాన్​ సవాలు చేసింది. ఫ్యూచర్ గ్రూపు లిమిటెడ్‌లో 49 శాతం కొనుగోలుకు 2019లో అమెజాన్ ఒక అంగీకారానికి వచ్చినా అది ముందుకు సాగలేదు. ఫ్యూచర్​ గ్రూపు కంపెనీ మొత్తంగా రూ.20,000కోట్ల రుణభారంతో ఉంది.

ఇదీ చదవండి:'మొత్తం మీరే చేశారు'.. అమెజాన్​పై బియానీ ఫైర్

ABOUT THE AUTHOR

...view details