తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్, ట్విట్టర్​కు రష్యాలో భారీ జరిమానా - రష్యా నిబంధనలు

ఫేస్​బుక్​, ట్విట్టర్​లకు రష్యాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా డేటా భద్రపరచాలన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది మాస్కో కోర్టు.

Russia fines Twitter, Facebook
ఫేస్​బుక్, ట్విట్టర్​కు రష్యాలో భారీ జరిమానా

By

Published : Feb 14, 2020, 7:17 AM IST

Updated : Mar 1, 2020, 6:58 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్​బుక్​, ట్విట్టర్​కు మాస్కోకోర్టు భారీ జరిమానా విధించింది. తమ దేశ పౌరుల డేటాను స్థానికంగా భద్ర పరచాలన్న రష్యా నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో చెరో 4 మిలియన్ల రుబెల్స్ (63,000 డాలర్లు) జరిమానా విధించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

రష్యా x ఇంటర్నెట్ కంపెనీలు..

రష్యా అంతర్జాల నిఘా సంస్థ రోస్కోమ్​నద్జోర్​​కు.. ఈ రెండు సామాజిక మాధ్యమ సంస్థలకు చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. అన్ని సామాజిక మాధ్యమాలు , అంతర్జాల సంస్థలు రష్యా పౌరుల డేటాను స్థానికంగానే భద్రపరచాలని 2014లో చట్టం తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం.

ఈ కారణాలతోనే ఇప్పటికే టెలిగ్రామ్​, లింక్​డ్ఇన్​ వంటి ప్రొఫెషనల్ నెట్​వర్క్​లపై నిషేధం విధించింది రష్యా.

ఇదీ చూడండి:మీకు తెలుసా... రతన్‌ టాటాకూ ఉందో లవ్‌స్టోరీ..!

Last Updated : Mar 1, 2020, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details