తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతి, రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి కొత్త మోడళ్లు

భారత్​ స్టేజ్​-6 ఉద్గార నియమాలకు అనుగుణంగా దేశీయ వాహన సంస్థలు తమ మోడళ్లను నవీకరించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ, రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థలు బీఎస్​-6 వేరియంట్​ మోడళ్లను నేడు మార్కెట్లోకి విడుదల చేశాయి.

BS VI
బీఎస్​-6

By

Published : Jan 20, 2020, 7:38 PM IST

Updated : Feb 17, 2020, 6:34 PM IST

దేశంలో విక్రయించే అన్ని రకాల వాహనాలకు భారత్​ స్టేజ్ (బీఎస్)-​ 6 ఉద్గార నియమాలను ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. వాహన తయారీ సంస్థలు అందుకు అనుగణంగా చర్యలు చేపడుతున్నాయి.బీఎస్​-6 వేరియంట్లకు తమ పాత మోడళ్లను నవీకరిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ, మోటార్​ బైక్​ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త మోడళ్లను నేడు మార్కెట్లోకి విడుదల చేశాయి.

మారుతీ సుజుకీ సెలేరియో..

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ) నేడు భారత విపణిలోకి సెలేరియో హ్యాచ్​బ్యాక్​ మోడల్​ను.. బీఎస్​-6 వేరియంట్​లో విడుదల చేసింది. సెలేరియో బీఎస్​-6 పెట్రోల్ ఇంజిన్​ వేరియంట్​ ధరను (ఎక్స్​షోరూం) రూ.4.41 లక్షల నుంచి రూ.5.72 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

సెలేరియో

సాహసాల బైక్​ 'హిమాలయన్​'

ప్రముఖ మోటార్​​ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. బీఎస్​-6 ఉద్గార నియమాలను పాటించే హిమాలయన్​ బైక్​ నేడు మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ మోడల్ ప్రారంభ ధర (ఎక్స్​షోరూం) రూ.1.86 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

హిమాలయన్​ బీఎస్​6 వేరియంట్​ బైక్​.. దేశంలోని అన్ని డీలర్​షిప్​ స్టోర్లలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది.

హిమాలయన్​

ఇదీ చూడండి:అమెజాన్ డెలివరీలకు..10 వేల ఎలక్ట్రిక్ వాహనాలు!

Last Updated : Feb 17, 2020, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details