తెలంగాణ

telangana

ETV Bharat / business

అందరికీ నష్టాలు... రిలయన్స్​కు లాభాలు... ఇందుకే! - ముకేశ్ అంబానీ

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసినప్పటికీ.. రిలయన్స్ షేర్లు మాత్రం నేడు దూసుకెళ్లాయి. వచ్చే 18 నెలల్లో రిలయన్స్​ను రుణ రహితంగా మారుస్తామన్న సంస్థ అధినేత ముకేశ్​ అంబానీ ప్రకటనతో షేర్లు 9.72 శాతం పుంజుకున్నాయి.

ముకేశ్ అంబానీ

By

Published : Aug 13, 2019, 4:44 PM IST

Updated : Sep 26, 2019, 9:19 PM IST

2021 మార్చి నాటికి కంపెనీ రుణరహితంగా మారుస్తామన్న ముకేశ్ అంబానీ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. రిలయన్స్​కు చెందిన​ చమురు, రసాయనాల వ్యాపారాల్లో 25 శాతం వాటాను సౌదీకి చెందిన 'అరామ్​కో' సంస్థకు విక్రయించనున్నట్లు సంస్థ ఛైర్మన్​ ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన సంస్థ సర్వ సభ్య సమావేశంలో ఈ ప్రకటన చేశారు ముకేశ్​.

ఈ ఒప్పందం ద్వారా సమకూరే నిధులను రిలయన్స్​ను అప్పులులేని సంస్థగా మార్చేందుకు వినియోగించనున్నట్లు వెల్లడించారాయన. వచ్చే నెల నుంచి జియో ఫైబర్​ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ సానుకూలతల నేపథ్యంలో రిలయన్స్​ షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు మదుపరులు.

బీఎస్​ఈలో రిలయన్స్ షేరు 9.72 శాతం లాభపడింది. షేరు ధర రూ.1,275కి చేరింది. ఎన్​ఎస్​ఈలోనూ సంస్థ షేరు 9.74 శాతం బలపడింది. షేరు ధర రూ. 1,275.30 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి: హెచ్​డీ టీవీ, సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా పొందండిలా...

Last Updated : Sep 26, 2019, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details