తెలంగాణ

telangana

ETV Bharat / business

నవ చరిత్ర: 10లక్షల కోట్లు దాటిన రిలయన్స్​ ఎం-క్యాప్​ - RIL first Indian firm to hit Rs 10 lakh cr m-cap mark

దేశీయ స్టాక్​మార్కెట్లలో రూ.10 లక్షల కోట్ల మార్కెట్​ విలువను దాటిన మొట్టమొదటి భారత సంస్థగా నిలిచింది రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​. ముకేశ్​ అంబానీకి చెందిన ఈ కంపెనీ షేర్లు.. ఈ ఏడాదే దాదాపు 40 శాతం పెరగడం విశేషం. రూ.7.79లక్షల కోట్ల మార్కెట్​ విలువతో టీసీఎస్​ రెండో స్థానంలో ఉంది.

RIL first Indian firm to hit Rs 10 lakh cr m-cap mark
నవ చరిత్ర: 10లక్షల కోట్లు దాటిన రిలయన్స్​ ఎం-క్యాప్​

By

Published : Nov 28, 2019, 5:04 PM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత వ్యాపార చరిత్రలో సరికొత్త అధ్యాయం లఖించింది. రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ విలువను దాటిన తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది.

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ షేర్లు ఇవాళ్టి బీఎస్​ఈ ట్రేడింగ్​లో 0.90శాతం పెరిగి రూ.1,584 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. తర్వాత కాస్త తగ్గి... 0.65 శాతం వృద్ధితో రూ.1,579.95 వద్ద స్థిరపడ్డాయి. ఎన్​ఎస్​ఈలో 0.77 శాతం లాభపడి రూ.1,582 వద్ద ముగిశాయి.

ఒక్క ఏడాదే 40 శాతం వృద్ధి..!

రిలయన్స్ షేరు ధర ఈ ఒక్క ఏడాదే 40శాతం వరకు పెరగడం విశేషం. రిలయన్స్‌ అక్టోబర్‌లో రూ.9లక్షల కోట్ల మార్కెట్‌ విలువను చేరుకొంది. అప్పటి నుంచి షేరు ధర పెరుగుతూ వస్తోంది. గతవారం రూ.9.5లక్షల కోట్ల మార్కెట్‌ విలువను దాటింది. ఈ వారంలో రూ.10లక్షల కోట్ల మార్కును అలవోకగా అధిగమించింది.

రిలయన్స్‌ తర్వాతి స్థానంలో టెక్ దిగ్గజం టీసీఎస్‌(రూ. 7.79 లక్షల కోట్లు) నిలిచింది. ఆయితే ఈ రెండు కంపెనీల మార్కెట్‌ విలువలో దాదాపు రూ.2లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది.

రూ.8లక్షల కోట్ల మైలురాయిని దాటిన తొలి కంపెనీ కూడా రిలయన్సే కావడం గమనార్హం.

ఇదీ చూడండి: రిలయన్స్​ జోరుతో జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details